ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, ఆరోగ్యం క్షీణించిన లెక్కచేయకుండా సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ పాదయాత్ర ముగిసింది. తెలంగాణ రాష్ట్రాన్ని 109 రోజుల్లో చుట్టేసిన భట్టి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఖమ్మం జనగర్జన సభ వరకు చేరుకోవడంతో ముగిసింది. ఖమ్మం సభ వేదికకు చేరుకోవడంతో పాదయాత్రను భట్టి విక్రమార్క ముగించారు. సుదీర్ఘ పాదయాత్ర చేసిన భట్టి విక్రమార్కను రాహుల్ గాంధీ ఖమ్మం సభలో సన్మానించారు.
2023 మార్చి 16వ తేదీన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భట్టి విక్రమార్క పాదయాత్ర ప్రారంభమైంది. మూడు నెలల పాటు భట్టి విక్రమార్క పీపుల్స్ పాదయాత్ర చేశారు. మొత్తం 109 రోజుల పాటు 1365 కిలోమీటర్ల పాటు భట్టి విక్రమార్క పాదయాత్ర నిర్వహించారు. ఖమ్మం సభ వేదికకు చేరుకుని భట్టి విక్రమార్క ముగించారు.