డ్వాక్రా మహిళలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

డ్వాక్రా మహిళలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.  రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా నిలిపివేసిన వడ్డీలేని  రుణాలను తిరిగి ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో జరిగిన పాలకమండలి సమావేశంలో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు.గ త నాలుగేళ్లుగా ఐటీడీఏ పాలకమండలి సమావేశం జరగలేదని..ఇప్పటి నుంచి ప్రతి 3 నెలలకోసారి సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.  ఇప్పటికే మహిళలకు పెద్దపీఠ వేశామని చెప్పారు. మహిళలకు ఫ్రీ జర్నీ కల్పించాం..త్వరలో డ్వాక్రా మహిళలందరికీ రుణాలు అందిస్తామని చెప్పారు. 

  గిరిజనుల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని భట్టి చెప్పారు. చాలా కాలం నుంచి జీతాలు రావడం లేదని ఆశా వర్కర్లు తన దృష్టికి తెచ్చారని..  వారికిజీతాలు అందేలా చూస్తామని తెలిపారు.