హైదరాబాద్లో పాపన్న గౌడ్ విగ్రహం : భట్టి

హైదరాబాద్లో  పాపన్న గౌడ్ విగ్రహం : భట్టి

హైదరాబాద్లో పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటు చేస్తామని.. ప్లేస్ చూసి ప్లాన్  రెడీ చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్ కు  సూచించారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సొంత గ్రామం సర్వాయిపేట గ్రామ అభివృద్ధికి రాష్ట్ర టూరిజం శాఖ నుంచి మొదటి దశ లో 4.70 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో నాలెడ్జ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రవీంద్ర భారతిలో సర్దార్ సర్వాయి పాపన్న 374వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ యాదవ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మె ల్యే ప్రేమ్ సాగర్ రావు, మహిళ కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద, బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం, పలువురు కార్పొరేషన్ చైర్మన్ లు అటెండ్ అయ్యారు. 

ఈసందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ 'రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ గురుకుల రెసిడెన్షియల్ క్యాంపస్ లు ఏర్పాటు చేస్తున్నం. ప్రభుత్వం తరపున అధికారికంగా సర్వాయి పాపన్న జయంతి కార్యక్రమం చేసుకుంటున్నం. బడుగు, బలహీనవర్గాలపై మా ప్రభుత్వా నికి ఉన్న చిత్తశుద్ధి తెలుపుతుంది. బలహీనవర్గాలు అంటే ఏం సాధించలేమని అనుకుంటారు. బడుగు వర్గాలకు పాపన్న గౌడ్ ఆదర్శం. ప్రభుత్వం తరపున సర్వాయి పేట గ్రామం పక్కన ఉన్న ఖిలాశ్ పూర్ ను కూడా టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేస్తం. మంత్రి పొన్నమ్ టూరిజం శాఖతో మాట్లాడి 4 కోట్ల 70 లక్ష లకు ఈరోజు జీవో ఇస్తున్నం. ఈ ప్రాంతాలకు ఇతర ప్రాంతాల నుంచి కూడా టూరిస్ట్ లు రావాలి. పాపన్న జీవితంపై బుక్ తయారు చేశారు. వీటిని ప్రింట్ చేయ డానికి బీసీ వెల్పేర్ శాఖ నిధులు ఇస్తుంది. తాను అను కున్న లక్ష్యాన్ని సాధించిన వ్యక్తి సర్దార్ పాపన్న. వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి' అని సూచించారు.

పాపన్న నేటి తరానికి ఆదర్శం: మంత్రి పొన్నం

గాంధీ భవన్ లో పీసీసీ కల్లు గీతా కార్మిక విభాగం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి వేడుకలు గ్రాండ్గా జరుపుకున్నారు. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాపన్న గౌడ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పిం చారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ 'ఆనాడు రాజ్యాధికారం కోసం వారి పోరా టాన్ని బడుగులను ఐక్యం చేసుకొని ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని గోల్కొండ కోట జయించిన సర్దార్ సర్వాయి పాపన్న నేటి తరానికి ఆదర్శం. అందరూ ఆయన జీవిత చరిత్ర తెలుసుకోవాలి. ఈరోజు ప్రజాస్వా మ్య పద్ధతిలో పెన్ను ద్వారా పోరాటం, ఓటు ద్వారా ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకు సాగాలి' అని పిలుపునిచ్చారు.