దేశ సంపదను అదానీ దోచుకుంటున్నారు.. జేపీసీతో విచారణ జరిపించాలి

దేశ సంపదను మోదీ అదానీకి కట్టబెడుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సెబీ అక్రమాలకు వ్యతిరేకంగా హైదరాబాద్ లోని ఈడీ ఆఫీసు నిర్వహించిన ఆందోళనలో భట్టి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన..  దేశ సంపదను అదానీ దోచుకుంటున్నారని విమర్శించారు.  అదానీ దోపిడిని రాహుల్  ప్రపంచానికి  వివరించారని చెప్పారు.  పేద ప్రజలకు కాంగ్రెస్ నిరంతరం అండగా ఉంటుందన్నారు భట్టి.   దేశం కోసం రాహుల్ గాందీ పోరాడుతున్నారని చెప్పారు. అదానీ అవినీతిని జేపీసీతో విచారణ జరిపించాలన్నారు.  దేశాన్ని, ప్రజల సంపదను కాంగ్రెస్ కాపాడుతుందన్నారు. ఏఐసీసీ పిలుపుతో  ఈడీ ఆఫీసు ముందు నిరసన తెలుపుతున్నామని చెప్పారు భట్టి.

అదానీ మెగా కుంభకోణంపై విచారణకు డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లోని ఈడీ ఆఫీస్ ముందు ఆందోళన చేశారు కాంగ్రెస్ నేతలు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల, పొన్నం, ఎంపీలు మల్లు రవి, పెద్దపల్లి ఎంపీ గడ్డంవంశీకృష్ణ,  ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, దానం, జయవీర్ రెడ్డి, ఆందోళనల్లో పాల్గొన్నారు.