2035 నాటికి 40 వేల మెగావాట్ల గ్రీన్ పవర్ : భట్టి విక్రమార్క

2035 నాటికి 40 వేల మెగావాట్ల గ్రీన్ పవర్ : భట్టి విక్రమార్క

 

  • సోలార్ రంగంలో  పెట్టుబడులు  పెట్టండి
  • హైదరాబాద్ లో అవకాశాలు కల్పిస్తం
  • గ్రీన్ పవర్ పెట్టుబడి దారుల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క


హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రం 2035 నాటికి 40 వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి చేసే రాష్ట్రంగా ఎదుగుతుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ఆయన గుజరాత్ రాజధాని గాంధీనగర్ లోని మహాత్మా మందిర్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్ లో నిర్వహించిన గ్రీన్ పవర్  ఎనర్జీ పెట్టుబడిదారుల సమావేశంలో మాట్లాడారు. ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. సోలార్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఔత్సాహిక పెట్టుబడి దారులు ముందుకు రావాలని, హైదరాబాద్ లో అన్ని అవకాలనూ కల్పిస్తామని వివరించారు. గ్రీన్ పవర్ ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు సమగ్ర ఇంధన విధానాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.  

పెరుగుతున్న ఇంధన అవసరాలను సమతుల్యం చేయడం స్థిరత్వానికి ఒక నిబద్దతగా తెలిపారు. తెలంగాణలో రాబోయే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సిటీ, ఫోర్త్ సిటీ, మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ను ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందని తెలిపారు.  సమావేశంలో ప్రధాని మోదీతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్గడ్, గోవా, రాజస్థాన్ ముఖ్యమంత్రిల తో పాటు కేంద్ర గ్రీన్ పవర్ మంత్రి, తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్లు ముషారఫ్, వరుణ్ రెడ్డి,   డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.