రేపటి నుంచి(జనవరి 26) నాలుగు కొత్త పథకాలు ప్రారంభించబోతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, రైతు భరోసా అమలు చేస్తామన్నారు. ప్రతీ మండలంలో ఒక గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని మధ్యాహ్నం ఒంటి గంటకు నాలుగు పథకాలను ప్రారంభిస్తామని చెప్పారు భట్టి.
లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామ సభలు నిర్వహించామని చెప్పారు. గ్రామాల్లో పథకాల కోసం లక్షల అప్లికేషన్లు వచ్చాయన్నారు.
జనవరి 26 నుంచి ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభిస్తామని చెప్పారు భట్టి. వ్యవయసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా ఇస్తామన్నారు భట్టి.
ALSO READ : ఇంత టాలెంటెడ్ ఐడియానా : దావోస్ పెట్టుబడులపై.. కేసీఆర్, కేటీఆర్ కడపు మంటతో హోర్డింగ్స్
రేషన్ కార్డుల విషయంలో ఎవరూ ఆందోళన చెందొద్దని చెప్పారు మంత్రి ఉత్తమ్. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తామని తెలిపారు. ఒక్కో వ్యక్తికి 6 కిలోల సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు.