గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లలో.. మీకంటే ఎక్కువ రుణమాఫీ చేశాం: భట్టి విక్రమార్క

గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లలో.. మీకంటే ఎక్కువ రుణమాఫీ చేశాం: భట్టి విక్రమార్క

దేశంలో ఎక్కడా లేని విధంగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పాం చేశామన్నారు డిప్యూ సీఎం భట్టి విక్రమార్క. రుణమాఫీపై బీఆర్ఎస్ నేతల తప్పుడు ప్రచారం మానుకోవాలన్నారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఎంత రుణమాఫీ అయ్యిందో అన్ని లెక్కలు తమ దగ్గర ఉన్నాయన్నారు. అన్ని గ్రామాల్లో రుణమాఫీ వివరాలను బోర్డులో పెడతామని చెప్పారు భట్టి. 

 ఇచ్చిన మాట తప్పొద్దని..ఏడాదిలోనే రుణమాఫీ చేశాం. రుణమాఫీపై అన్ని గ్రామాల్లో  డిస్ ప్లే చేస్తున్నాం. గజ్వేల్ లో  237కోట్లు, సిరిసిల్లలో 175 కోట్లు రుణమాఫీ చేశాం. అవసరమైతే అసెంబ్లీ బయట బోర్డ్ లో వివరాలు పెడతాం. నిర్మల్ నయోకవర్గానికి202 కోట్లు ఇచ్చాం. సిద్దిపేటలో బీఆర్ఎస్ హయాంలో 96 .62కోట్ల రుణమాఫీ చేస్తే.. మా హయాంలో 177 కోట్ల రుణమాఫీ చేశాం. ప్రతి శాసనసభ నియోజకవర్గ లెక్కలు ఉన్నాయి.  మేం పనులు చేశాం..మీలాగా ప్రచారం చేయలేదు.  చెప్పిన స్కీంలన్నీ తప్పకుండా అమలు చేస్తాం. ఈ రాష్ట్ర ఖజానా ప్రజల కోసం కానీ బీఆర్ఎస్ నేతలకు కాదు. తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదు. ఏ పథానికి ఎక్కడ ఎన్ని కోట్లు ఖర్చు  చేశామో లెక్కలు ఉన్నాయి అని తెలిపారు భట్టి విక్రమార్క. 

Also Read : జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయండి

ఇంత పెద్ద రుణమాఫీ దేశంలో ఎక్కడా జరగదన్నారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.  రూ 21 వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. రుణమాఫీపై బీఆర్ఎస్ కు ఎందుకు కడుపు మంటో అర్థం కావడం లేదన్నారు. జనగామలో 28 వేల మంది రైతులకు రుణమాఫీ జరిగిందని చెప్పారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.