HCU ఇంచు భూమి కూడా తీసుకోలేదు.. ఇదంతా బీఆర్ఎస్, బీజేపీ కుట్ర:భట్టి విక్రమార్క

HCU ఇంచు భూమి కూడా తీసుకోలేదు.. ఇదంతా బీఆర్ఎస్, బీజేపీ కుట్ర:భట్టి విక్రమార్క

 కంచె గచ్చిబౌలి భూములపై బీఆర్ఎస్, బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హెచ్ సీయూ  ఇంచు భూమి కూడా ప్రభుత్వం తీసుకోలేదన్నారు భట్టి.   హెచ్ సీయూ భూములను  గుంజుకుంటున్నారని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలనే తమ ఆలోచన అని అన్నారు. 13 ,01,2004 వరకు ఆ భూములు  హెచ్ సీయూవేనని చెప్పారు. ఆ తర్వాత 2004 లో   బదలాయింపు  కింద హెచ్ సీయూకి పక్కనే  397 ఎకరాలను  ప్రభుత్వం  కేటాయించిందన్నారు . ఆనాటి ప్రభుత్వానికి హెచ్ సీయూ 400 ఎకరాలు ఇచ్చిందన్నారు.  బిల్లీరావు అనే వ్యక్తి చేతిలో ఇన్ని రోజులు ఆ భూమి ఉందన్నారు భట్టి. ఆ భూమి తమదేనని బిల్లీరావు సుప్రీంలో రిట్  పిటిషన్ వేశారని చెప్పారు. 

ALSO READ : గచ్చిబౌలి భూవివాదంపై బీఆర్ఎస్, బీజేపీవి డ్రామాలు: మహేష్ గౌడ్

2014నుంచి2013  వరకు ఆ భూములను  బీఆర్ఎస్ ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు భట్టి.  వేల కోట్ల భూమిని 400 ఎకరాలు ప్రైవేట్ వ్యక్తికి  ఎలా అప్పగిస్తాం.  ప్రభుత్వ భూమి ఇంచు కూడా వెళ్లకూడదని కేబినెట్ నిర్ణయించింది. ఈ భూములపై కాంగ్రెస్ సర్కార్ పోరాడింది. హైకోర్టులో కొట్లాడి కేసు గెలిచాం. దశాబ్ద కాలం పోరాడి ఆ భూములను కాపాడినం. వేల కోట్ల విలువైన భూములను  ప్రజలకు దక్కేలా చేశాం.  ప్రజల కలలను నిజం చేసేందుకు మేం పోరాటం చేస్తున్నాం. మా ఆలోచన అంతా సంపదను సృష్టించడంపైనే.  రాజకీయ స్వార్థం  కోసం కొన్ని పార్టీలు కుట్ర చేస్తున్నాయి అని భట్టి అన్నారు.