- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఎర్రుపాలెం(మధిర), వెలుగు : మధిరను అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా అభివృద్ధి చేస్తానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం మధిరలో రూ.19 కోట్లతో సైడ్ కాల్వలు, ఫుట్ పాత్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ మధిర ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడేలా చేసేందుకు కృషి చేస్తున్నానన్నారు. భవిష్యత్తు లో ఇతర ప్రాంతాల ప్రజలు మధిరలో స్థిరపడేందుకు ఇష్టపడేలా మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు.
మధిర పట్టణ అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా పార్టీ అధికార ప్రతినిధి వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ వాసిరెడ్డి రామనాథం, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సురంశెట్టి కిషోర్, పట్టణ అధ్యక్షుడు మిర్యాల వెంకటరమణ గుప్తా, కౌన్సిలర్ కోనాధని కుమార్, శ్రీనిధి విద్యాసంస్థల అధినేత ఇది అనిల్ కుమార్ నెహ్రూ తదితరులు పాల్గొన్నారు.
వీఆర్వోలను రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలని వినతి
ముదిగొండ, వెలుగు : వీఆర్వోలను రెవెన్యూ శాఖలోకి తీసుకొని ఆప్షన్ పద్ధతిలో శాఖలోనే విలీనం చేయాలని కోరుతూ తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరికె ఉపేంద్రరావు ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వినతిపత్రం అందజేశారు. ఆదివారం ముదిగొండ మండలం వనంవారి కృష్ణాపురంలో సంఘం సభ్యులు ఆయనను కలిశారు. దీనికి భట్టి స్పందిస్తూ వారి సమస్యలన్నీ త్వరలోనే పరిష్కారమవుతాయని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో షేక్ నాగుల్ మీరా, కిషోర్, పాయం వెంకటేశ్వర్లు, ఇప్తాకర్, అహమ్మద్, షేక్ జానీమియా తదితరులు ఉన్నారు.