దేశ సంపదను ప్రజలకు పంచుతాం: భట్టీ విక్రమార్క

దేశ సంపదను ప్రజలకు పంచుతాం: భట్టీ విక్రమార్క

జయశంకర్ భూపాలపల్లి: దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మే 14వ తేదీ మంగళవారం  జిల్లాలో కాటారం మండలం దన్వాడలో శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి భట్టి విక్రమార్క దర్శించుకున్నారు. శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయ 3వ వార్షికోత్సవం సందర్భంగా మంత్రలు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రులిద్దరికి స్వామి వారి తీర్థ్ర ప్రసాదాలను అందజేశారు అర్చకులు.

అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. ధన్వాడలో శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం తన అదృష్టం గా భావిస్తున్నానని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 12 నుండి 14 స్థానాలు కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజలు భారీ ఎత్తున పోలింగ్ లో పాల్గోన్నారని.. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతున్నాననన్నారు. ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. దేశంలోని సంపదన ప్రజలకు సమానంగా పంచుతామని డిప్యూటీ సీఎం  అన్నారు.