గ్రామీణ రైతులకు బ్యాంకింగ్ వ్యవస్థ బ్యాక్ బోన్ లాంటిది: భట్టి

గ్రామీణ రైతులకు బ్యాంకింగ్ వ్యవస్థ బ్యాక్ బోన్ లాంటిది: భట్టి

గ్రామీణ ప్రాంత రైతులకు బ్యాంకింగ్ వ్యవస్థ ఒక బ్యాక్ బోన్ లాంటిదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.  తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది.  హైదరాబాద్  మ్యారి గోల్డ్ హోటల్ లో ఏర్పాటు చేసిన నాబార్డ్ రాష్ట్ర క్రెడిట్ సెమినార్ లో    స్టేట్ ఫోకస్  పెపర్ 2025-26 ను విడుదల చేశారు  భట్టి విక్రమార్క. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..  భారతదేశంలోనే  తెలంగాణ  వృద్ధి రేటు గణనీయ సంఖ్యలో పెరిగిందన్నారు.  గత ప్రభుత్వం వ్యవసాయ రంగం పై  నిర్లక్ష్యం చూపిందని విమర్శించారు.

రానున్న రోజుల్లో నాబార్డ్ ఫ్లోరీ కల్చర్ కు సహకారం అందించాలన్నారు భట్టి. ఆయిల్ ఫాం కల్టివేషన్ అనేది  ఇతర దేశాల్లో వెళ్లి చూశాం. అలా మన రాష్ట్రంలో చేయాలి.  అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి.  ఇలాంటివి ఎంకరేజ్ చేయాలి. అర్గానికి ఫామింగ్ పై దృష్టి సారించాలి. మహారాష్ట్ర రాష్ట్రలో మామిడి ఎక్కువ ఎగుమతులు చేస్తుంది. కెన్యా దేశంలో మొబైల్ బ్యాంకింగ్ సిస్టం వల్ల గ్రామీణ ప్రాంతాలలో సులువుగా పనులు చేసుకుంటున్నారని అన్నారు  భట్టి.

రైతులకు రుణాలివ్వడంలో బ్యాంకులు ఆలస్యం చేయొద్దు: తుమ్మల

వ్యవసాయం రంగం పట్ల తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది .  దేశంలోనే తెలంగాణ రాష్టం వ్యవసాయంలో ముందు వరుసలో ఉన్నాం. ఆయిల్ ఫామ్  పంటతో పాటు ఇతర పంటలకు బ్యాంకులు సహాయం అందించాలి. ఎగుమతులకు,స్టోరేజ్ కి సంబంధించి బ్యాంకులు సపోర్ట్ చేయాలి. ఆర్టీకల్చర్ సాంగు విషయంలో చాలా వరకు కోతులతో సమస్య ఉంది. ఈ వైపరీత్యం నుండి బయట పడాలి అంటే మీరు రైతులకు సహాయం చేయాలి.  ఇంత భూభాగం ఉండి, ఇన్ని వనరులు ఉండి ఇంకా బయట నుండి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. 

అన్ని రకాల పంటల కోసం రైతు బ్యాంక్ వస్తె  బ్యాకింగ్ రంగం వారు రైతుకు ముందు గౌరవం ఇవ్వాలి.  కొంత మంది లోన్ ఎగ్గొడితే వారి ఇండ్లకు తాళాలు వేస్తున్నారు. ఇంకొంత మంది అసలే అడగరు.  చేత కాకపోతే రైతు వచ్చే సంవత్సరం లోన్ కడతాడు.. కానీ వ్యాపారులు విషయంలో అలా చేయరు మీకు దొరకరు రైతు నీ ఇబ్బంది పెట్టకండి.  స్టేట్ ఫోకస్ పేపర్ ప్రజలకు ఉపయోగ పడేలా ఉండాలి అని తుమ్మల అన్నారు.