భట్టి ఆవేదనను అర్థం చేసుకోవాలి

భట్టి ఆవేదనను అర్థం చేసుకోవాలి
  • మీడియాతో చిట్​చాట్​లో మంత్రి శ్రీధర్ బాబు 

హైదరాబాద్, వెలుగు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాజకీయంగా ఏనాడు తన సామాజిక వర్గం పేరు చెప్పుకోలేదని, అలాంటి వ్యక్తి నిండు సభలో దళితుడినని ప్రస్తావించాల్సి వచ్చిందంటే ఆయన ఏ స్థాయిలో బాధపడి ఉంటాడో అర్థం చేసుకోవచ్చని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం అసెంబ్లీలోని లాబీలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. 

సభలో సబితా ఇంద్రారెడ్డి విషయం చర్చకు వచ్చిన సందర్భంలో భట్టి జోక్యం చేసుకొని మాట్లాడిన తీరు అభినందనీయ మన్నారు. ఇన్నేళ్ల తర్వాత ఆయన తనకు జరిగిన అన్యాయంపై మొదటిసారి నోరు విప్పారన్నారు. సభలో సీఎం రేవంత్ రెడ్డి ఎవరి పేరునూ ప్రస్తావించలేదని, బీఆర్ఎస్ నాయకులు సీఎం వ్యాఖ్య లను వక్రీకరిస్తున్నారని చెప్పారు. ఆ పార్టీ నాయకులు అనవసరంగా ఆవేశపడుతున్నారన్నారు.