కాంగ్రెస్ పార్టీలో చేరికలతో బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ కు నిద్రపట్టడం లేదని విమర్శించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పార్టీ లీడర్లను కాపాడుకునే ప్రయత్నంలో కేసీఆర్ దిగజారి మాట్లాడారన్నారు. కేసీఆర్ మాటల్లో కొంచెమైనా వాస్తవాలు లేవన్నారు భట్టి. పదేళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి ఇంతగా దిగజారుతారు అనుకోలేదని చెప్పారు. కట్టుకథలు చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని కేసీఆర్ ప్రయత్నించారని ఆరోపించారు.
నీళ్లు, కాళేశ్వరం గురించి కేసీఆర్ నిజాలు చెప్పలేదన్నారు భట్టి విక్రమార్క.. మీటింగ్ లో మైక్ సమస్య వస్తే.. కరెంట్ కోతలు అంటూ అబద్ధం మాట్లాడారంటూ మండిపడ్దారు. రాష్ట్రంలో అనేక సమస్యలకు బీఆర్ఎస్ పాలనే కారణమని ఆరోపించారు. సరిదిద్దుకోలేనంత తప్పిదాలు గత ప్రభుత్వమే చేసిందన్నారు.
ALSO READ :- X లో ట్రెండ్ అవుతున్న Click Here ..దీని గురించి మీకు తెలుసా..?
అస్థవ్యస్థమైన అర్థిక వ్యవస్థను మూడు నెలల నుంచి గాడిలో పెడుతున్నామని చెప్పారు. కేసీఆర్ చేసిన అప్పుల్ని ఇప్పటికి తీర్చలేకపోతున్నామన్నారు. యాదాద్రి థర్మల్ ప్రాజెక్టు నిర్మించిన స్థలమే కరెక్ట్ కాదని చెప్పారు భట్టి. పర్యావరణ అనుమతులు తెచ్చుకోకపోవడం వల్లే యాదాద్రి ప్రాజెక్టు ఆలస్యమవుతుందని వెల్లడించారు.