ప్రకృతిని దేవతగా పూజించే పూల పండుగ బతుకమ్మ... బతుకుదెరువును మెరుగు పరిచే అమ్మ కాబట్టి గౌరమ్మను బతుకమ్మ అని పిలుస్తారు భక్తులు. ప్రకృతి నుంచి సేకరించిన పూలను తిరిగి ప్రకృతికే సమర్పించడం ఈ పండుగ విశిష్టత, తొమ్మిది రోజులపాటు రకరకాల పూలతో బతుకమ్మను చేసి పూజించడం తెలంగాణ ఆడపడుచుల ఆచారం. ఈ పండుగలో నాలుగో రోజును నానబియ్యం బతుకమ్మ' అంటారు. ప్రతిరోజులాగే ఈరోజు బతుకమ్మను పేర్చి, ఆటపాటలతో పూజించి నిమజ్జనం చేస్తారు. గౌరమ్మకు నైవేద్యంగా ఈరోజు నానబియ్యంతో చేసిన పాయసం సమర్పిస్తారు.
పాయసం ప్రసాదం తయారీకి కావలసినవి:
- నానబెట్టిన బియ్యం : ఒక కప్పు
- బెల్లం తురుము - : ముప్పావు కప్పు
- పాలు : - ఒక కప్పు
- ఇలాచీ పొడి: - పావు టీ స్పూన్
- నెయ్యి- : సరిపడా
- నీళ్లు- : ఒక కప్పు
- డ్రై ఫ్రూట్స్ -: అర కప్పు (బాదం, కిస్మిస్, జీడిపప్పు)
తయారీ విధానం: నానబెట్టిన బియ్యాన్ని ఆరబెట్టాలి. తర్వాత వాటిని మిక్సీ లేదా రోట్లో వేసి పిండిగా చేయాలి. స్టవ్ పై పాన్ పెట్టి నెయ్యి వేడి చేయాలి. వాటిలో డ్రైఫ్రూట్స్ ని వేగించాక, పాలు, నీళ్లు పోసి మరిగించాలి. సన్నని మంట పెట్టి అందులో బియ్యం పిండి వేస్తూ ఉండలు కట్టకుండా కలపాలి. చివరగా బెల్లం తురుము, ఇలాచీ పొడి వేసి కలపాలి. రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆపేయాలి. బతుకమ్మకు నైవేద్యంగా పెట్టే పాయసం రెడీ.
ALSO READ | Bathukamma Special: తెలంగాణ పల్లెల్లో.. జనం మాటల్లో బతుకమ్మ గాథలు ఇవీ..!
-వెలుగు, లైఫ్–