రూల్స్‌‌‌‌‌‌‌‌ పాటిస్తూ ప్రచారం చేసుకోవాలి : కలెక్టర్‌‌‌‌‌‌‌‌ భవేశ్‌‌‌‌‌‌‌‌ మిశ్రా

భూపాలపల్లి అర్బన్‌‌‌‌‌‌‌‌, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడే క్యాండిడేట్లు రూల్స్‌‌‌‌‌‌‌‌ పాటిస్తూ ప్రచారం చేసుకోవాలని భూపాలపల్లి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌‌‌‌‌‌‌‌ భవేశ్‌‌‌‌‌‌‌‌ మిశ్రా చెప్పారు. సాధారణ పరిశీలకులు అభయ్‌‌‌‌‌‌‌‌ నందన్‌‌‌‌‌‌‌‌ అభస్తా, ఎన్నికల వ్యయపరిశీలకులు కౌశిక్‌‌‌‌‌‌‌‌రాయ్‌‌‌‌‌‌‌‌, పోలీస్‌‌‌‌‌‌‌‌ పరిశీలకుడు అమిత్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌తో కలిసి రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ క్యాండిడేట్లు ఎన్నికల ప్రచారంలో విద్వేషపూరిత ప్రసంగాలు చేయవద్దని సూచించారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ర్యాలీలు, సభల నిర్వహణకు క్యాండిడేట్లు ముందస్తుగా పర్మిషన్‌‌‌‌‌‌‌‌ తీసుకోవాలని చెప్పారు.ఎలక్షన్‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌  ఉల్లంఘన, డబ్బు, మద్యం పంపిణీపై సీ విజిల్‌‌‌‌‌‌‌‌ యాప్‌‌‌‌‌‌‌‌, 1950 టోల్‌‌‌‌‌‌‌‌ ఫ్రీ నంబర్‌‌‌‌‌‌‌‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఎన్నికల నిర్వహణ పర్యవేక్షణకు కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో కంట్రోల్‌‌‌‌‌‌‌‌ రూమ్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేశామని, ఏవైనా సందేహాలు ఉంటే 08713293371 నంబర్‌‌‌‌‌‌‌‌ ఫోన్‌‌‌‌‌‌‌‌ చేయాలని సూచించారు. రివ్యూలో ఎస్పీ కిరణ్‌‌‌‌‌‌‌‌ కారే, అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ ఉమా శంకర్‌‌‌‌‌‌‌‌ ప్రసాద్‌‌‌‌‌‌‌‌ 
పాల్గొన్నారు.

స్ట్రాంగ్‌‌‌‌‌‌‌‌రూం, కౌంటింగ్‌‌‌‌‌‌‌‌ కేంద్రాల పరిశీలన

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌‌‌‌‌‌‌‌ స్టేడియం కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌‌‌‌‌‌‌‌రూమ్‌‌‌‌‌‌‌‌, కౌంటింగ్‌‌‌‌‌‌‌‌ కేంద్రాన్ని శనివారం పోలీసు, సాధారణ, వ్యయ పరిశీలకులు అమిత్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, అభయ్ నందన్ అభస్తా, కౌశిక్‌‌‌‌‌‌‌‌ రాయ్‌‌‌‌‌‌‌‌, కలెక్టర్‌‌‌‌‌‌‌‌ భవేశ్‌‌‌‌‌‌‌‌మిశ్రాతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కౌంటింగ్‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌ వద్ద పార్కింగ్‌‌‌‌‌‌‌‌, భద్రతాపరమైన చర్యలను ఎస్పీ కిరణ్‌‌‌‌‌‌‌‌ ఖారే వివరించారు. ఓట్ల లెక్కింపునకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్‌‌‌‌‌‌‌‌ తెలిపారు. వారి వెంట అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్లు వెంకటేశ్వర్లు, ఉమా శంకర్‌‌‌‌‌‌‌‌ప్రసాద్‌‌‌‌‌‌‌‌, ఆర్డీవో రమాదేవి ఉన్నారు.

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు

ములుగు, వెలుగు :  ఎన్నికలను  ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని ములుగు కలెక్టర్‌‌‌‌‌‌‌‌ ఇలా త్రిపాఠి చెప్పారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు సవిన్‌‌‌‌‌‌‌‌ బన్సల్, పోలీస్ అబ్జర్వర్‌‌‌‌‌‌‌‌ అంజన్ చక్రబోర్తి, వ్యయ పరిశీలకులు వాగీశ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌, ఎస్పీ గౌష్‌‌‌‌‌‌‌‌ ఆలంతో కలిసి నోడల్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు, టీమ్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల ఏర్పాట్లపై పవర్‌‌‌‌‌‌‌‌ పాయింట్‌‌‌‌‌‌‌‌ ప్రజంటేషన్‌‌‌‌‌‌‌‌ ద్వారా వివరించారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 303 పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది, ఈవీఎంల మొదటి ర్యాండమైజేషన్‌‌‌‌‌‌‌‌, పోలింగ్ సిబ్బంది ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌ పూర్తైందన్నారు. జిల్లా వ్యాప్తంగా 9 ఎఫ్‌‌‌‌‌‌‌‌ఎస్టీ, 10 ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌టీ, 8 వీఎస్టీ టీమ్స్‌‌‌‌‌‌‌‌కో నిఘా పెట్టామన్నారు.ప్రజలు స్వేచ్చాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు. రివ్యూలో అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్లు వేణుగోపాల్, డీఎస్‌‌‌‌‌‌‌‌.వెంకన్న, ఆర్డీవో సత్యపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి, అడిషనల్‌‌‌‌‌‌‌‌ ఎస్పీ సదానందం ఉన్నారు.