భూపాలపల్లి అర్భన్, వెలుగు: మెడికల్ కాలేజ్ నిర్మాణ స్థలాన్ని చదును చేసి నిర్మాణ పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అర్ అండ్ బీ ఆఫీసర్లను ఆదేశించారు. మంజూర్ నగర్ లో మెడికల్ కాలేజ్ నిర్మాణానికి కేటాయించిన భూమిని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టెండర్ ప్రాసెస్ ను పూర్తి చేసి నిర్మాణ పనులను చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్అండ్ బీ ఈఈ వేంకటేశ్వర్లు, డీఈ రమేశ్పాల్గొన్నారు.
అపరిచితులకు వ్యక్తి గత వివరాలు చొప్పొద్దు.. మొబైల్ ఫోన్ లో వ్యక్తి గత వివరాలు పూర్తి సమాచారాన్ని సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. సోమవారం కలెక్టరేట్లో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ముద్రించిన ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. మొబైల్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ జాగ్రత్త గా ఉండాలన్నారు. ప్రజలు మొబైల్ ఫోన్ లో వచ్చే మెస్సేజ్ లను ఒకే అని కానీ, ఓటీపీ ని గుర్తు తెలియని వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లో చెప్పొద్దని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎల్ తిరుపతి, అన్ని బ్యాంక్ ల మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.
ALSO READ : వరంగల్ రైల్వే స్టేషన్కు కొత్త హంగులు .. 25.41కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం