
హైదరాబాద్, వెలుగు: జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (జేబీసీ)–తెలంగాణ ఓపెన్ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌కు చెందిన భవేశ్ రెడ్డి టైటిల్ నెగ్గాడు. శనివారం జరిగిన అండర్13 బాయ్స్ ఫైనల్లో భవేశ్ 15–13, 15–4తో దర్ష్ గోయెల్‌పై నెగ్గాడు. గర్ల్స్ అండర్15 ఫైనల్లో మన్య 15–9, 15–11తో ఏంజెడ్‌లోను ఓడించింది. అండర్17 తుదిపోరులో మన్య 15–11, 15–14తో అనన్యపై వరుస గేమ్స్‌లో గెలిచింది. ఇండియా డబుల్స్ స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టి విన్నర్లకు ట్రోఫీలు అందజేశారు.