లింగంపేట, వెలుగు: మండలంలోని భవానీపేట జడ్పీ హైస్కూల్ హిందీ టీచర్ జబ్బార్(28) సోమవారం రాత్రి గుండె పోటుతో చనిపోయారని హెడ్మాస్టర్ జైపాల్‌రెడ్డి తెలిపారు. బాన్సువాడ మండలం కొయ్యగుట్ట గ్రామానికి చెందిన జబ్బార్ 2022 జనవరిలో భవానీపేట హైస్కూల్లో హిందీ టీచర్‌గా విధుల్లో చేరారు. కొద్ది రోజులుగా బోన్క్యాన్సర్ కు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోయాడన్నారు. పీఆర్టీయూ నేతలు, భవానీపేట గ్రామస్తులు సంతాపం తెలిపారు.
అమ్రాద్ వీఆర్ఏ..
మాక్లూర్, వెలుగు: మండలంలోని అమ్రాద్ గ్రామానికి చెందిన వీఆర్ఏ సుంకరి విఠల్(46) మంగళవారం గుండెపోటుతో చనిపోయారు. పేస్కేల్, ప్రమోషన్ల కోసం 80 రోజులు సమ్మెలో చురుకుగా పాల్గొన్న విఠల్ నిత్యం మనోవేదనకు గురయ్యేవాడని, సమ్మె కాలంలో జీతం రాక ఆర్థిక ఇబ్బందులు పెరిగి గుండె పోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు.