నేటి నుంచి భీం జ్ఞాన దీక్షలు

స్వేరోల ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి భీం జ్ఞాన దీక్షలు ప్రారంభం కానున్నాయి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి లో ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఈ సందర్భంగా 20 వేల మంది దీక్షలు చేపడతారు. నెలరోజుల పాటు ఈ దీక్షలు ఉంటాయి. స్వేరోల ఆధ్వర్యంలో ఇలా భీం దీక్షలు చేపట్టడం ఇది ఆరోసారి. భీం దీక్ష వలన బోలెడన్ని సత్ఫలితాలు ఉన్నా యి. ఈ దీక్ష చేసే ప్రతి వ్యక్తి సంపూర్ణ స్వేరోగా మారి సమాజంలో ప్రత్యేక గుర్తింపు సాధించుకుంటారు. భీం దీక్ష ద్వారా స్వేరోలుగా మారిన వారికి సంపూర్ణ మనశ్శాంతి, ఆరోగ్యం , తెలివి, దృఢ సంకల్పం, కచ్చితమైన లక్ష్యాలు, సానుకూల దృక్పధం, జీవితానికి అవసరమైన మానసిక స్థయిర్యం లభిస్తాయి. సమాజంలో సోదర భావం, బలమైన కుటుంబ సంబంధాలు ఏర్పడతాయి. ప్రతి మహిళా స్వేరో ఇంతకుముం దు ఎన్నడూ చూడని ఒక కొత్త ఆనందకరమైన వాతావరణంలో ప్రత్యేక  గుర్తింపు పొందుతారు. ప్రతి విద్యార్థి స్వేరోకు భీం దీక్ష వలన చదువుకునే శక్తి పెరుగుతుంది. భీం దీక్ష పాటించి న ప్రతి కుటుం బం ఆనందంతో జీవిస్తుంది. 2014 నుంచి నేను భీం దీక్ష చేస్తున్నాను. దీక్ష ఫలితంగా నా జీవితంలో ఎన్నో ఊహించని మార్పు లు సంభవించాయి. అంతేకాదు నా వ్యాపారం కూడా అభివృద్ది చెందింది.

-చింత సదానందం, స్వేరో తెలంగాణ రాష్ట్ర సంస్కృతి విభాగం కో ఆర్డినేటర్