![పవర్‌ఫుల్ భీమా](https://static.v6velugu.com/uploads/2024/01/bheema-movie-new-poster-out-on-republic-day-eve_QkaRbGEfoH.jpg)
గోపీచంద్ హీరోగా కన్నడ దర్శకుడు ఎ.హర్ష తెరకెక్కిస్తున్న చిత్రం ‘భీమా’. కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన గోపీచంద్ లుక్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. రిపబ్లిక్ డే సందర్భంగా శుక్రవారం ఈ చిత్రానికి సంబంధించి గోపీచంద్ మరో లుక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని స్టైలిష్‌గా కూర్చున్న గోపీచంద్ పవర్‌ఫుల్ గెటప్‌లో కనిపిస్తూ ఇంటెన్స్ లుక్‌లో ఇంప్రెస్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. అజ్జు మహంకాళి డైలాగ్స్ రాస్తున్నాడు. ఫిబ్రవరి 16న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.