ముంబై: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’. ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందించారు. ఫిబ్రవరి 25న విడుదలైన ఈ సినిమా విజయవంతంగా నడుస్తోంది. ఈ మూవీని తెలుగుతోపాటు హిందీలోనూ ఒకేసారి రిలీజ్ చేద్దామనుకన్నారు. కానీ లాస్ట్ మినిట్‌లో తెలుగు సినిమాకే మేకర్స్ ఎక్కువ సమయం కేటాయించడంతో కాస్త ఆలస్యంగా నార్త్ ఆడియన్స్ ను పలకరించేందుకు సిద్ధమయ్యాడు భీమ్లా నాయక్. ఈ చిత్ర హిందీ వెర్షన్ ట్రైలర్ తాజాగా రిలీజైంది. రెండోసారి ప్రీ రిలీజ్ వేడుక సందర్బంగా విడుదల చేసిన ట్రైలర్‌నే హిందీలోనూ రిలీజ్ చేశారు. కానీ హిందీలో ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారనేది మాత్రం మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. ఇక హిందీ ట్రైలర్ లోనూ పవన్, రానాల మధ్య సీన్స్ హైలైట్ గా నిలిచాయి.
మరిన్ని వార్తల కోసం:
వీఐపీ దర్శనాలు తగ్గించి.. సామాన్యులకు ప్రయారిటీ
మేయర్ పీఠంపై తొలిసారి దళిత మహిళ
నాతో చర్చలకు రా.. పుతిన్‌కు జెలెన్స్కీ పిలుపు
After roaring success in Telugu, The Power Storm is all set to takeover in Hindi! ?#BheemlaNayakHindi Trailer is here ▶️ https://t.co/Z9ghs7HiJl@pawankalyan @RanaDaggubati
— Sithara Entertainments (@SitharaEnts) March 4, 2022
#Trivikram @saagar_chandrak @MenenNithya @MusicThaman @iamsamyuktha_ @dop007 @NavinNooli @vamsi84 pic.twitter.com/ZIbX4aBqMX