BHELకు రూ.11 వేల కోట్ల అదానీ పవర్ ఆర్డర్స్

BHELకు రూ.11 వేల కోట్ల అదానీ పవర్ ఆర్డర్స్

భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) అదానీ పవర్ కి చెందిన మహాన్ ఎనర్జెన్ లిమిటెడ్ (MEL) నుండి మూడు 'సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్' ఏర్పాటుకు గాను రూ. 11,000 కోట్ల విలువైన ఆర్డర్‌లను పొందినట్లు తెలుస్తోంది.ఈ మూడు ప్రాజెక్టులలో ఒక్కొక్కటి 2x800 మెగావాట్ల రేటింగ్‌ను కలిగి ఉండనుంది.రాజస్థాన్‌లోని కవాయ్, మధ్యప్రదేశ్‌లోని మహాన్‌లో ఈ మూడు ప్రాజెక్టులు నిర్మించనున్నట్లు తెలుస్తోంది.ఈ డీల్ ప్రభావం BHEL షేర్లపై పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఈ మూడు ప్రాజెక్టులు పూర్తవ్వటానికి నెల రోజులు పట్టచ్చని తెలుస్తోంది. ఇక ఈ డీల్ ద్వారా BHEL ఆదాయం కూడా పెరుగుతుందని చెప్పచ్చు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను జూన్ త్రైమాసికంలో, BHEL వార్షిక ఆదాయం 9.6 శాతం పెరిగి రూ. 5,484 కోట్లకు చేరుకుంది.

Also Read:-6 లక్షల ఉద్యోగాలతో యాపిల్ వేల కోట్ల పెట్టుబడులు

2024-25 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ కాలానికి గాను అదానీ పవర్ కన్సాలిడేటెడ్ కంటిన్యూఇంగ్ ప్రాఫిట్ రూ. 2,303 కోట్ల నుండి 95 శాతం పెరిగి రూ. 4,483 కోట్లకు చేరింది.అదానీ పవర్ కన్సాలిడేటెడ్ పవర్ సేల్స్ పరిమాణం 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను మొదటి క్వార్టర్లో  17.5 బిలియన్ యూనిట్ల నుండి 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో 38 శాతం పెరిగి 24.1 బిలియన్ యూనిట్లకు చేరుకుంది.