
ఇంజినీర్ ట్రైనీ, సూపర్వైజర్ ట్రైనీ పోస్టుల భర్తీకి భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్(బీహెచ్ఈఎల్) నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 28వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టులు 400: ఇంజినీర్ ట్రైనీలు 150: మెకానికల్70, ఎలక్ట్రికల్25, సివిల్25, ఎలక్ట్రానిక్స్ 20, కెమికల్5, మెటలర్జీ 5.
సూపర్వైజర్ ట్రైనీ 250: మెకానికల్140, ఎలక్ట్రికల్55, సివిల్35, ఎలక్ట్రానిక్స్20.
ఎలిజిబిలిటీ: ఇంజినీర్ ట్రైనీ పోస్టులకు ఇంజినీరింగ్/ టెక్నాలజీలో ఫుల్‌టైం బ్యాచిలర్ డిగ్రీ లేదా సంబంధిత విభాగంలో ఇంటిగ్రేటెడ్ మాస్టర్ డిగ్రీ, డ్యూయల్ డిగ్రీ ఉత్తీర్ణత. సూపర్వైజర్ పోస్టులకు సంబంధిత విభాగంలో రెగ్యులర్ ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
అప్లికేషన్ ఫీజు: యూఆర్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.1072, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు/ ఎక్స్ సర్వీస్ మెన్ వారికి రూ.472.
సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.