గుడ్ న్యూస్: బీహెచ్​ఈఎల్​​లో మేనేజర్ పోస్టులు

గుడ్ న్యూస్: బీహెచ్​ఈఎల్​​లో మేనేజర్ పోస్టులు

ఇంజినీర్, మేనేజర్ పోస్టుల భర్తీకి భారత్​ హెవీ ఎలక్ట్రికల్స్​ లిమిటెడ్, బెంగళూరు నోటిఫికేషన్​ జారీ చేసింది. అర్హత గల అభ్యర్థులు మార్చి 4వ తేదీలోగా ఆన్​లైన్​లో అప్లై చేసుకోవచ్చు. 

పోస్టులు 20: సీనియర్​ ఇంజినీర్–ఈ2: 13, డిప్యూటీ మేనేజర్ ఈ3: 3, మేనేజర్ ఈ4, సీనియర్​ మేనేజర్​ఈ 5–4.

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్సీ(ఎలక్ట్రికల్, మెకానికల్), ఎంఈ, ఎంటెక్​లో ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. 2025, ఫిబ్రవరి 1 నాటికి సీనియర్​ మేనేజర్​కు 42 ఏండ్లు, మేనేజర్​కు 39 ఏండ్లు, మిగతా పోస్టులకు 32 ఏండ్లు నిండి ఉండాలి. 
సెలెక్షన్​ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా. 
అప్లికేషన్ లాస్ట్ డేట్: మార్చి 4.