
న్యూఢిల్లీ: ప్రభుత్వ కంపెనీ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (భెల్) గుజరాత్లో 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంటు నిర్మించడానికి రూ.7,500 కోట్ల విలువైన కాంట్రాక్టు దక్కించుకుంది. గుజరాత్ స్టేట్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ ఇచ్చిన ఈ ప్రాజెక్టు 54 నెలల్లోపు మొదలవుతుంది. కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా కాంట్రాక్టును దక్కించుకున్నామని భెల్ ప్రకటించింది. ప్లాంటు డిజైన్, ఇంజనీరింగ్, మానుఫ్యాక్చరింగ్, సప్లై, టెస్టింగ్, కమిషనింగ్పనులను తామే చూసుకుంటామని భెల్విడుదల చేసిన ప్రకటన తెలిపింది.