ఎందుకు దూకారో.. మధ్యాహ్నం నుంచి ఫోన్ స్విచాఫ్.. చెరువులో శవమై తేలిన భిక్కనూరు ఎస్ఐ, మరో ఇద్దరు..

ఎందుకు దూకారో.. మధ్యాహ్నం నుంచి ఫోన్ స్విచాఫ్.. చెరువులో శవమై తేలిన భిక్కనూరు ఎస్ఐ, మరో ఇద్దరు..

కామారెడ్డి: భిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ మృతదేహం ఆడ్లూరు ఎల్లారెడ్డి చెరువు దగ్గర లభ్యమైంది. చెరువులో కానిస్టేబుల్ శృతి, ఆపరేటర్ నిఖిల్ మృత దేహాలు అర్ధరాత్రి దొరకగా, భిక్కనూరు ఎస్ఐ సాయికుమార్ మృతదేహం గురువారం ఉదయం లభ్యమైంది. బుధవారం మధ్యాహ్నం నుంచి భిక్కనూరు ఎస్ఐ సాయికుమార్ అదృశ్యమయ్యాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో పోలీస్ శాఖలో కలకలం రేగింది.

భిక్కనూర్ ఎస్.ఐ. సాయి కుమార్, బీబీ పేట పీఎస్ కానిస్టేబుల్ శృతి, బీబీ పేట సహకార సంఘం ఆపరేటర్ నిఖిల్ మిస్సింగ్ కామారెడ్డి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. బుధవారం మధ్యాహ్నం నుంచి ముగ్గురి మిస్సింగ్ పోలీస్ శాఖను షాక్కు గురిచేసింది. ఈ ముగ్గురి ఆత్మహత్యకు కారణాలు తెలియలేదు. కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ  ఘటనా స్థలానికి చేరుకుని  పరిశీలిస్తున్నారు. ఎస్సై మిస్సింగ్​పై ఉన్నతాధికారులకు సమాచారం అందడంతో సెల్ ఫోన్​ సిగ్నల్స్​​ఆధారంగా పోలీసులు గాలింపు చేపట్టారు.

సదాశివనగర్​ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు సమీపంలో టవర్ ​లొకేషన్ ఆగిపోయినట్టు గుర్తించారు. చెరువు కట్ట సమీపంలో ఎస్సై సొంత కారును గుర్తించారు. చెరువు గట్టున ఇద్దరు పురుషుల చెప్పులు ఉన్నట్టు కనుగొన్నారు. వీరి సెల్​ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ఫైర్ స్టేషన్​ సిబ్బంది అక్కడికి చేరుకొని, గజ ఈతగాళ్లతో చెరువులో అర్ధరాత్రి వరకు గాలించారు. మహిళా కానిస్టేబుల్తో పాటు నిఖిల్​ డెడ్​ బాడీలు లభ్యమయ్యాయి. ఎస్ఐ ఆచూకీ గురువారం ఉదయం లభ్యమైంది.