- భువనగిరి ఎంపీ టికెట్ భిక్షమయ్య గౌడ్‌కే ?
- కేటీఆర్ భరోసా ఇచ్చినట్టు ప్రచారం
- కుంభం వెళ్లిపోవడంతో లైన్ క్లియర్
యాదాద్రి, వెలుగు : కుంభం అనిల్ కుమార్‌రెడ్డి బీఆర్ఎస్ నుంచి తిరిగి కాంగ్రెస్‌లో చేరడం బూడిద భిక్షమయ్య గౌడ్‌కు కలిసివచ్చింది. ఆయనకు భువనగిరి నుంచి బీఆర్ఎస్ఎంపీ టికెట్కన్ఫర్మ్అయినట్టు ఆయన సన్నిహితులు సంబరపడుతున్నారు. తనను కలిసిన భిక్షమయ్యకు నియోజకవర్గంలో పని చేసుకోవాలని మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చారని చెప్తున్నారు. బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన భిక్షమయ్య కొంతకాలం కింద తిరిగి బీఆర్ఎస్ లోకి వచ్చారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి గానీ, ఎంపీ టికెట్గానీ ఇస్తామని హైకమాండ్ చెప్పినట్టు ప్రచారం జరిగింది.
ఇంతలోనే కాంగ్రెస్ నుంచి వచ్చిన కుంభంకు ఎంపీ టికెట్ఆఫర్ చేయడం, గవర్నర్ కోటాలో శ్రవణ్, సత్యనారాయణ పేర్లను ప్రతిపాదించడంతో ఆయన వర్గం నిరాశ చెందింది. తాజాగా కుంభం అనిల్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్‌కు వెళ్లడంతో భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి భిక్షమయ్యకు అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. ఈ విషయం స్వయంగా కేటీఆరే చెప్పారని భిక్షమయ్య అనుచరవర్గం సంతోషంలో మునిగిపోయింది.