చేవెళ్ల, వెలుగు: అబద్ధాలతో మోసగించడంలో ప్రధాని మోదీ.. సీఎం కేసీఆర్ ఒక్కటేనని చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పామెన భీం భరత్ అన్నారు. ఆదివారం చేవెళ్ల నియోజకవర్గం పరిధిలోని నవాబ్‌పేట మండలం మైతాప్‌ఖాన్‌గూడ, దాతాపూర్, శంకర్పల్లి మండల పరిధిలోని చిన్నారెడ్డి గూడ, కొత్తగూడ, లచ్చిరెడ్డి గూడ తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
అనంతరం చేవెళ్ల మండల పరిధిలోని ఇబ్రహీంపల్లి వద్ద ఉన్న ఎస్ఏ పంక్షన్ హాల్‌లో ముస్లిం మైనార్టీలతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముస్లిం మైనార్టీ సోదరులను కాంగ్రెస్ పార్టీ రానున్న కాలంలో అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అందరికీ ఆమోదయోగ్యంగా ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు బండారు ఆగిరెడ్డి, పడాల రాములు, మండల పార్టీ అధ్యక్షుడు వీరేందర్‌రెడ్డి, మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు రెడ్డిశెట్టి మధుసూదన్‌గుప్తా, తదితరులు పాల్గొన్నారు.