BHIM పేమెంట్స్ యాప్ వినియోగదారుల కోసం రూ. 750 వరకు క్యాష్ బ్యాక్ డీల్ లను అందిస్తోంది. డైనింగ్, ట్రావెలింగ్, రూపే క్రెడిట్ కార్డ్ ని లింక్ చేయడంతో సహా నిర్ధిష్ట లావాదేవాలపై డబ్బును తిరిగి పొందే అవకాశాన్ని కల్పిస్తోంది.
రూ. 150 క్యాష్ బ్యాక్ ఆఫర్
వినియోగదారులు భోజనం, ప్రయాణం చేయడానికి BHIM యాప్ ని ఉపయోగించడం ద్వారా రూ. 150 ల ఫ్లాట్ క్యాష్ బ్యాక్ పొందవచ్చు. రైల్వే టిక్కెట్ బుకింగ్ లు , క్యాబ్ రైడ్ లు, మర్చంట్ UPI QR కోడ్ ద్వారా చెల్లించే రెస్టారెంట్ బిల్లులతో సహా ఫుడ్, ట్రావెలింగ్ ఖర్చుల కోసం రూ. 100 కంటే ఎక్కువ లావాదేవీలపై రూ. 30 క్యాష్ బ్యాక్ అందిస్తుంది. గరిష్ట క్యాష్ బ్యాక్ పరిమితి రూ. 150 , వినియోగదారులు పూర్తి మొత్తాన్ని సంపాదించేందుకు కనీసం ఐదుసార్లు ఈ ఆఫర్ ను పొందాలి.
అదనంగా రూ.600 క్యాష్ బ్యాక్ ఆఫర్
రూపే క్రెడిట్ కార్డ్ హోల్డర్లు తమ కార్డుని BHIM యాప్ కి లింక్ చేయడం ద్వారా రూ. 600 అదనపు క్యాష్ బ్యాక్ ను అన్ లాక్ చేయవచ్చు. ఈ ఆఫర్ లో ఒక్కొక్కటి రూ. 100 కంటే ఎక్కువ మొదటి మూడు లావాదేవీలపై రూ. 100 క్యాష్ బ్యాక్ , ఆ తర్వాతి ప్రతి నెలా రూ. 200 కంటే ఎక్కువల లావాదేవీలపై రూ. 30 క్యాష్ బ్యాక్ ఉంటుంది. ఈ లావాదేవీలను పూర్తి చేయడం ద్వారా వినియోగదారులు మొత్తం రూ. 600 క్యాష్ బ్యాక్ ను పొందవచ్చు.
Urja 1 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్
BHIM యాప్ వినియోగదారులు Urja1 శాతం పథకం నుంచి కూడా ప్రయోజనం పొందవచ్చు. ఇది పెట్రోల్, డీజిల్, CNGతో సహా అన్ని ఇంధన చెల్లింపులపై ఫ్లాట్ 1 శాతం క్యాష్ బ్యాక్ ను అందిస్తుంది. అలాగే విద్యుత్, నీరు, గ్యాస్ బిల్లుల వంటి యూటిలిటీ బిల్లు చెల్లింపులను అందిస్తుంది. BHIM యాప్ తో లింక్ చేయబడిన వినియోగదారు ప్రాథమిక బ్యాంక్ ఖాతాకు క్యాష్ బ్యాక్ నేరుగా క్రెడిట్ చేయబడుతుంది.
ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్లు 2024 మార్చి 31 వరకు అందుబాటులో ఉంటాయి. వినియోగదారులు వీటిని క్లెయిమ్ చేసుకోవడానికి ఏడు వారాల సమయం ఉంది. ఆఫర్లను పొడిగించే అవకాశం పై స్పష్టత లేదు. కాబట్టి వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలి.