చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఇండ్లు, ఆఫీసుల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేయడంపై కాంగ్రెస్ నేతలు,కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాల్క సుమన్ ఓటమికి భయపడే ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నాడంటూ భీమారం మండలానికి చెందిన కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలు వివేక్ కోసం సైనికుల్లా పనిచేస్తామన్నారు. వివేక్ వెంకటస్వామి ఇళ్లపై ఐటీ దాడులను నిరసిస్తూ పార్టీ లీడర్ల ప్రెస్ మీట్ నిర్వహించారు.
చెన్నూర్ లో బాల్క సుమన్ చేసే అరాచకాలు,అఘాయిత్యలన్నీ నియోజకవర్గ ప్రజలు చూస్తున్నారని భీమారం మండలానికి చెందిన కాంగ్రెస్ నేతలు చెప్పారు. బాల్క సుమన్ జైలుకు వెళ్లే రోజులు దగ్గర పడ్డాయని, సీబీఐ, ఐటీ దాడులు అతనిపై కూడా జరిగే రోజులు వస్తాయన్నారు. పెద్దపల్లి ఎంపీగా వివేక్ ప్రజలకు ఎన్నో సేవలు అందించారని తెలిపారు. ఈ ఎన్నికల్లో వివేక్ వెంకటస్వామిని గెలిపించి బాల్క సుమన్ ను తరిమికొడతామని పిలుపునిచ్చారు.