ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకోం : కాంగ్రెస్ ​లీడర్లు

ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకోం : కాంగ్రెస్ ​లీడర్లు

జైపూర్, వెలుగు: చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామిపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకోబోమని భీమారం మండల కాంగ్రెస్ ​లీడర్లు హెచ్చరించారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మండల పరిధిలోని నేషనల్​ హైవే జోడువాగుపై బ్రిడ్జి నిర్మాణం జరగకుండా ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని బీఆర్​ఎస్ ​లీడర్ ​కలగూర రాజ్​కుమార్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని మండపడ్డారు.

నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోఅభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే వివేక్ ​వెంకటస్వామి విశేష కృషిచేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేదిలేదని వెల్లడించారు. లీడర్లు తైనేని రవి, బూనేని సుధాకర్, అంగడి రాజ్యం, కోట రమేశ్, రవితేజ, అజయ్​, నరేశ్​ తదితరులు పాల్గొన్నారు.