
మరో వారం రోజుల్లో విడుదల కానున్న ‘భీమ్లా నాయక్’ మూవీ కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ప్రమోషన్స్ కూడా పీక్స్‌లో ఉన్నాయి. అయితే కరోనా కారణంగా మూవీ షూటింగ్ బాగా లేటయ్యింది. ఎట్టకేలకి నిన్న ముగిసింది. కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో బ్యాలెన్స్ పార్ట్ షూట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఇందులో పాల్గొన్నారు. ఆయనపై ఓ పాటను తీశారు. దీంతో షూట్ మొత్తం పూర్తయ్యింది. ఈ విషయాన్ని దర్శకుడు సాగర్ చంద్ర సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశాడు. పవన్ పోలీసాఫీసర్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో.. ఆయనతో తలపడే సత్తా ఉన్న వ్యక్తిగా రానా నటిస్తున్నాడు. నిత్యామీనన్, సంయుక్తా మీనన్ హీరోయిన్స్. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాయడంతో మూవీకి మరింత హైప్ వచ్చింది. తమన్ సంగీతం సెన్సేషనల్ హిట్టై పవర్ స్టార్ ఫ్యాన్స్‌లో జోష్ నింపింది. ఇక ఫిబ్రవరి 25న థియేటర్ల దగ్గర సందడి ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి.