భీంపూర్లో కలకలం రేపుతున్నపులి సంచారం

ఆదిలాబాద్ అర్బన్, వెలుగు:  ఆదిలాబాద్ జిల్లా భీంపూర్  మండలంలో  పులి సంచారం కలకలం రేపుతోంది. మూడు రోజుల వ్యవధిలో రెండు పశువులను హతమార్చడంతో  జనం ఆందోళనకు గురవుతున్నారు. రైతులు వ్యవసాయ పనులకు వెళ్లేందుకు జంకుతున్నారు.పులి సంచారాన్ని గుర్తించేందుకు ఫారెస్ట్ ఆఫీసర్లు చర్యలు చేపట్టారు. ఆదిలాబాద్ ఎఫ్ఆర్వో శ్రీనివాస్,  డిప్యూటీ ఎఫ్ఆర్వో  గీరయ్య ఆధ్వర్యంలో తాంసికె ప్రాంతంలో పది మంది అటవీశాఖ సిబ్బందితో  స్పెషల్ బేస్ క్యాంపు ఏర్పాటు చేశారు. హత్తిఘాట్, తాంసి కె ప్రాంతంలో సీసీ కెమెరాలు బిగించి పర్యవేక్షిస్తున్నారు. పెన్ గంగా నది తీరంలోని మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం పది కిలో మీటర్ల దూరంలోనే ఉండడంతో అక్కడి నుంచి పులి ఈ ప్రాంతానికి రాకపోకలు సాగిస్తున్నట్లుగా అంచనా వేస్తున్నారు.