బెండకాయతో పరోటా..ఇది తింటే మాత్రం..

బెండకాయతో పరోటా..ఇది తింటే మాత్రం..

ప్రతీ రోజు ఇంటర్నెట్లో  కొత్త కొత్త వంటలు పుట్టుకొస్తుంటాయి. భోజన ప్రియులు కొత్త కొత్త వంటకాలను తయారు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో నెటిజన్లతో పంచుకుంటారు. తాజాగా ఓ సరికొత్త వంటకం వీడియో వైరల్ అవుతోంది. ఆ వంటకం ఏంటో చూసేద్దాం..
సాధారణంగా ఆలూ పరోటా గురించి తెలుసు. క్యాబేజీ పరాటా గురించి తెలుసు. కానీ బెండకాయ పరోటా  గురించి తెలుసా. ఏంటీ బెండకాయతో పరోటానా... అని అనుకుంటున్నారా..? అవును..బెండకాయతో ఓ భోజన ప్రియుడు చేసిన పరోటా ప్రస్తుతం..నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 

బెండకాయ పరోటా  ఎలా చేస్తారంటే..

వీడియో ప్రకారం ఓ మహిళ పరోటా కోసం పిండిని నానబెట్టి పెట్టుకుంటుంది. ఆ తర్వాత బెండకాయలను నాలుగు ముక్కలుగా కోసి..ఓ గిన్నెలో వేస్తుంది. అందులో కొద్దిగా పసుపు, కారం, ధనియాల పొడి, కొద్దిగా ఉప్పు, అందులో కొద్దిగా శనగపిండి వేయాలి. మంచిగా కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత పిండితో రొట్టెలెక్క చేసుకుని..వాటి మధ్యలో బెండకాయ మిశ్రమాన్ని వేసుకోవాలి.  ఉండలెక్క చేసుకుని.. దాన్ని  మళ్లీ పరోటా చేసుకోవాలి. పెనం మీద కాల్చుకోవాలి. మధ్య మధ్యలో నూనే వేసుకోవాలి. అంతే బెండకాయ పరోటా  రెడీ. బెండకాయ కూర అంటే ఇష్టపడే భోజన ప్రియులు..పరోటాను ఇలా తయారు చేసుకుని తింటే బాగుంటుందని చెబుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం..తయారు చేసుకుని తినండి

ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ బెండకాయ పరోటా  వీడియో ప్రస్తుతం  ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ  రీల్‌కు 8.6 మిలియన్ల మంది వీక్షించారు. అయితే ఈ బెండకాయ పరోటాపై విభిన్నంగా కామెంట్స్ చేశారు.  బెండకాయతో ఈ పరోటా  అనేది చెడ్డ ఆలోచన అని కామెంట్ పెట్టారు. మరొకరు "మంచి ప్రయత్నం. అంటూ కొనియాడారు.