భద్రాద్రిలో ఘనంగా భీష్మ ఏకాదశి

భద్రాద్రిలో ఘనంగా భీష్మ ఏకాదశి

భద్రాచలం, వెలుగు : భీష్మ ఏకాదశి సందర్భంగా శనివారం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామయ్య పాదుకలకు భద్రుడి మండపంలో విశేష అభిషేకాలు నిర్వహించగా, గర్భగుడిలో మూలవరులకు సువర్ణ తులసీదళాలతో అర్చన చేశారు. కల్యాణమూర్తులను బేడా మండపానికి తీసుకొచ్చి కల్యాణం జరిపించారు. సాయంత్రం దర్బారు సేవ నిర్వహించారు.

భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం జూనియర్‌‌‌‌‌‌‌‌ కాలేజీ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో విరాట్‌‌‌‌‌‌‌‌ విష్ణు సహస్రనామ స్త్రోత్ర పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి త్రిదండి చినజీయర్​స్వామి హాజరై భీష్మ ఏకాదశి, గీతా జయంతి విశిష్టతను తెలియజేశారు. ఈ సందర్భంగా జీయర్‌‌‌‌‌‌‌‌ మఠం నుంచి శోభాయాత్ర నిర్వహించారు.

చిన్నారుల వేషధారణ, కొమ్ము నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం భక్తులకు విష్ణు సహస్రనామస్త్రోత్ర పారాయణం పుస్తకాలను పంపిణీ చేశారు. అంతకుముందు ఆలయానికి వచ్చిన చినజీయర్‌‌‌‌‌‌‌‌ స్వామికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. బేడా మండపంలో భక్తులకు ప్రవచనం చెప్పారు.