భీష్మ ఏకాదశి ఎప్పుడు.. ఆ రోజు ఏం చేయాలి.. ఏం చేయకూడదు

భీష్మ ఏకాదశి ఎప్పుడు.. ఆ రోజు ఏం చేయాలి.. ఏం చేయకూడదు

హిందూ మతంలో ప్రతి నెల శుక్ల పక్షం, కృష్ణ పక్షం ఏకాదశి రోజున విష్ణువుని పూజించడం చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మాఘ మాసం శుక్ల పక్షం ఏకాదశి రోజున భీష్మ ఏకాదశి  లేదా జయ ఏకాదశి జరుపుకుంటారు. ఈ ఏడాది ( 2025) భీష్మ ఏకాదశిని ఫిబ్రవరి 8 న జరుపుకుంటారు.హిందూ పంచాగం ప్రకారం  భీష్మ ఏకాదశి  మాఘమాసం శుక్ల పక్షం 11వ రోజున వస్తుంది.

భీష్మ  ఏకాదశి శుభ ముహూర్తం

  • ఏకాదశి తిథి ప్రారంభం: ఫిబ్రవరి 7వ తేదీ ఉదయం 9.26 గంటలకు
  • ఏకాదశి తిథి ముగింపు: ఫిబ్రవరి 8 వ తేది రాత్రి   8.15 గంటల వరకు

ఫిబ్రవరి 8వ తేదీ సూర్యోదయం నాటికి ఏకాదశి ఉన్న కారణంగా  భీష్మ ఏకాదశి ఫిబ్రవరి 8న జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. ఈ రోజున ఉపవాస దీక్షను పాటిస్తారు. అలాగే శ్రీ మహా విష్ణువును, లక్ష్మీ దేవిని పూజిస్తారు.

 భీష్మ ఏకాదశి రోజున ( ఫిబ్రవరి 8)  చేయాల్సిన పనులు

  • భీష్మ ఏకాదశి నాడు తెల్లవారుజామున లేచి స్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి.
  • ఆ తరువాత పీటపై  పసుపు రంగు కొత్త గుడ్డను ఉంచి కొద్దిగా బియ్యం పోసి వాటిపై తమలపాకు పెట్టి..విష్ణుమూర్తి.. లక్ష్మీ దేవి  విగ్రహాలను లేదా చిత్రపటాన్ని ప్రతిష్ఠించుకోవాలి.
  • సంకల్పం చెప్పుకుని  ఉపవాస దీక్ష చేపట్టి, విష్ణువును పూజించండి.
  • షోడశపచార పూజలు చేసి పసుపు.. కుంకుమ.. గంధం సమర్పించండి.  పూలలో పసుపురంగు పూలు ఉండే విధంగా చూసుకోండి.
  • విష్ణు సహస్రనామం చదవండి. లేకపోతే శ్రద్దగా.. భక్తితో వినండి.  అలాగే లక్ష్మీ దేవిని పూజించండి.
  • తులసి చెట్టు వద్ద దీపం వెలిగించి.. ధూప .. దీప.. నైవేద్యం సమర్పించండి. పాలు.. కొబ్బరితో చేసిన స్వీట్లను నైవేద్యంగా సమర్పించండి. 
  • ఏకాదశి నాడు పేదవారికి ఆహార పదార్థాలు ...  డబ్బును దానం చేయాలి.

Also Read :- త్వరలో జీఎస్‌‌‌‌టీ రేట్లు తగ్గిస్తాం

 చేయకూడనివి

  • ఏకాదశి రోజున బియ్యంతో తయారు చేసిన పదార్ధాలను  తినకూడదు.
  • గొడవలు, తగాదాలు ..  హింసకు పాల్పడకండి.
  • మద్యం ..ధూమపానం .. పొగాకు .. మొదలైన వాటికి దూరంగా ఉండంది.
  • వెల్లుల్లి, ఉల్లిపాయ, వంకాయ,  తమలపాకు, మాంసాహార పదార్థాలను తినకూడదు.
  • భోగభాగ్యాలు, మోసం, జూదం మొదలైన చెడు పనులకు దూరంగా ఉండాలి.
  •  ఇతరుల గురించి చెడుగా మాట్లాడకుండా ఉండండి.

దక్షిణ భారతీయులు భీష్మ ఏకాదశి అంటే.. ఉత్తర భారతదేశంలో జయ ఏకాదశి  అంటారు. భీష్ముడు ఉత్తరాయణ పుణ్య కాలంలో తనువు చాలించాడు. భీష్ముడు చనిపోయే ముందు ధర్మరాజుకి విష్ణు సహస్ర నామాన్ని బోధించిన పవిత్రమైన తిథిని ఏకాదశి అంటారు. ఈరోజు భీష్ముడికి తర్పణం చేసి మహా విష్ణువుని పూజించిన వారికి స్వర్గ ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. ఈరోజు ఏ కార్యం తలపెట్టినా కూడా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. భీష్మ ఏకాదశి వ్రతం చాలా శక్తివంతమైనదని నమ్ముతారు. ఈరోజు ఉపవాసం ఉంటే బ్రహ్మ హత్య పాపం నుంచి కూడా విముక్తి కలుగుతుందని విశ్వసిస్తారు.