- జగిత్యాల బీజేపీ అభ్యర్థి బోగ శ్రావణి
జగిత్యాల, వెలుగు : అబద్ధపు హామీలతో పసుపు, చెరుకు రైతులను బీఆర్ఎస్సర్కార్ మోసం చేసిందని జగిత్యాల బీజేపీ అభ్యర్థి భోగ శ్రావణి విమర్శించారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని కమలా నిలయంలో పలువురు నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ తమ పోరాటం వల్లే పసుపు బోర్డు వచ్చిందని గొప్పలు చెబుతున్న ఎమ్మెల్సీ కవిత 5 ఏండ్లు ఎంపీగా ఉండి పసుపు రైతులకు ఎందుకు న్యాయం చేయలేదని ప్రశ్నించారు. షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని హామీ ఇచ్చి రైతులను నిండా ముంచారని ఆరోపించారు.
అవినీతి పాలనను అంతమొందించాలి
గోదావరిఖని, వెలుగు : రాముడు తిరిగిన నేలలో రావణాసురుడిని తరిమికొట్టాలని, అవినీతి పాలనను అంతమొందించాలని బీజేపీ రామగుండం అభ్యర్థి కందుల సంధ్యారాణి పిలుపునిచ్చారు. శుక్రవారం గోదావరిఖని సప్తగిరి కాలనీలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆమె మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో కొంతమంది నాయకులు అవినీతిని లీగల్‌గా మార్చుకొని రూ.కోట్లు సంపాదిస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా ఇప్ప లత నరసింహులు ఆధ్వర్యంలో 200 మంది మహిళలు బీజేపీలో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.