పాలమూరు జిల్లాలో సంక్రాంతి శోభ

భోగి పండుగను సోమవారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఇంటి ముంగిళ్లలో రంగురంగుల ముగ్గులు వేశారు. గొబ్బెమ్మలను పెట్టి పూజలు చేస్తారు. గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. రంగు ముగ్గుల దుకాణాలు, పతంగుల షాపులు కిటకిటలాడాయి. 

పలు ప్రాంతాల్లో ముగ్గుల పోటీలు నిర్వహించగా, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేసి అభినందించారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న వారంతా సంక్రాంతి పండుగకు ఇండ్లకు చేరుకోవడంతో సందడి నెలకొంది.  – వెలుగు ఫొటోగ్రాఫర్, మహబూబ్​నగర్