మెగా హీరోను కంగారు పెట్టిన కీర్తి

టాలీవుడ్​లో మహానటి  సినిమాతో కీర్తి సురేశ్(Keerti Suresh)​ సృష్టించిన సంచలనం తెలిసిందే. ఇప్పటికీ సావిత్రి అంటే మహానటి సినిమానే గుర్తుచేసుకుంటారు. ఈ సినిమాతో కీర్తి విమర్శకులు ప్రశంసలందుకుంది. తాజాగా మెగాస్టార్​ చిరంజీవి(Chiranjeevi) కూడా కీర్తిని ఆకాశానికెత్తేశారు. 

భోళా శంకర్( Bhola shankar) ​లో చిరుకి చెల్లెలి పాత్రలో కీర్తి నటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ఈవెంట్​లో చిరు మాట్లాడుతూ.. మహానటి కదా అందుకే జాగ్రత్తగా ఉన్నా.. లేదంటే తొక్కేస్తుంది..అంటూ సరదా కామెంట్స్​ చేశారు. తన యాక్టింగ్​ స్కిల్స్​పై ప్రశంసలు కురిపించారు.  కీర్తి సురేశ్​ని పెర్ఫార్మెన్స్​ పరంగా మరో స్థాయికి తీసుకెళ్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

ఈ నెల 11న భోళా శంకర్​ థియేటర్లలో సందడి చేయనుంది. ఇక సౌత్​లో లేడీ ఓరియెంటెడ్​ సినిమాలతో ఫెయిల్యూర్స్​ చూసిన కీర్తి ఇప్పుడు బాలీవుడ్​పై ఫోకస్​ పెట్టినట్టు టాక్.