బోలే బాబానే చెప్పాడు : తొక్కిసలాటకు కారణమైన వాళ్లు శిక్ష నుంచి తప్పించుకోలేరని

బోలే బాబానే చెప్పాడు : తొక్కిసలాటకు కారణమైన వాళ్లు శిక్ష నుంచి తప్పించుకోలేరని

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ జిల్లా ఫుల్రాయ్ గ్రామంలో జరిగిన సత్సంగ్‌లో కార్యక్రమంలో 120 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. శుక్రవారం ఈ విషయంపై సూరజ్ పాల్ అలియాస్ భోలేబాబా కెమోరా ముందుకు వచ్చి మాట్లాడారు. అంత విషాదం జరిగిన తర్వాత నేను తీవ్ర విషాదానికి గురయ్యాను, దీనికి కారణమైన దుర్మార్గులు తప్పించుకోలేరనే నమ్మకం నాకు ఉందని బాబా అన్నారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు అండగా నిలవాలని కమిటీ సభ్యులను కోరారు.

జూలై 2 సంఘటన తర్వాత నేను చాలా బాధపడ్డాను. ఈ బాధను భరించే శక్తిని దేవుడు మాకు ప్రసాదిస్తాడు. దయచేసి ప్రభుత్వం మరియు పరిపాలనపై నమ్మకం ఉంచండి. గందరగోళం సృష్టించిన వారెవరైనా విడిచిపెట్టబడరని నాకు నమ్మకం ఉందని భోలే బాబా తెలిపారు. ఆయన న్యాయవాది ఏపీ సింగ్ ద్వారా మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు అండగా ఉండి, వారి జీవితాంతం వారికి సహాయం చేయాలని నేను కమిటీ సభ్యులను కోరానన్నాడు.

సికిందరావు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు దేవప్రకాష్ మధుకర్ ఢిల్లీలో లొంగిపోయాడు. శుక్రవారం రాత్రి అతన్ని ఉత్తరప్రదేశ్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. గురువారం సత్సంగ్ ఆర్గనైజింగ్ కమిటీలో సభ్యులుగా ఉన్న ఇద్దరు మహిళా వాలంటీర్లు సహా ఆరుగురిని అరెస్టు చేశారు.