అస్సాంలో టాటా చిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు భూమి పూజ

అస్సాంలో టాటా చిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు భూమి పూజ
  • పెట్టుబడి రూ.27 వేల కోట్లు

న్యూఢిల్లీ: అస్సాంలో టాటా ఎలక్ట్రానిక్స్ రూ. 27 వేల కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్న చిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల తయారీ ప్లాంట్ వచ్చే ఏడాదిలో అందుబాటులోకి వస్తుందని టాటా సన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రకటించారు. సుమారు 27 వేల ఉద్యోగాలు క్రియేట్ అవుతాయని చెప్పారు. ప్లాంట్ భూమి పూజలో పాల్గొన్న ఆయన, ఇప్పటికే అస్సాంలో వెయ్యిమందికి ఉద్యోగాలిచ్చామని తెలిపారు.  

ప్లాంట్ విస్తరించే కొద్దీ  మొత్తం సెమీకండక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎకోసిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  డెవలప్ అవుతుందని, మరిన్ని కంపెనీలు తమ ప్లాంట్లను ఇండియాలో ఏర్పాటు చేస్తాయని వివరించారు. ‘ చిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల తయారీ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో డైరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా 15 వేల మందికి, ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డైరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా 12 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఫ్యాక్టరీ నిర్మాణ పనుల వేగం పెంచుతాం.  వచ్చే ఏడాది ఏదో టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తవుతుంది. కార్యకలాపాలను ప్రారంభిస్తాం’ అని చంద్రశేఖరన్ వివరించారు. 

సప్లయర్లు తమ  ప్లాంట్లను కూడా ఇండియాలో ఏర్పాటు చేస్తారని అంచనా వేశారు. ప్లాంట్ భూమి పూజకు అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ పాల్గొన్నారు. అస్సాంలో ఏర్పాటు చేస్తున్న ఈ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎటువంటి అడ్డంకులు ఉండవని ఆయన హామీ ఇచ్చారు. ఈ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రాష్ట్రంలో ఇండస్ట్రియల్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ మెరుగుపడుతుందని, మరిన్ని ఉద్యోగాలు వస్తాయన్నారు.