సొంత డబ్బులతో గద్దర్​ విగ్రహం ఏర్పాటు: మహిపాల్​ రెడ్డి 

సొంత డబ్బులతో గద్దర్​ విగ్రహం ఏర్పాటు: మహిపాల్​ రెడ్డి 

పటాన్​చెరు, వెలుగు : తన సొంత డబ్బులతో గద్దర్​ విగ్రహ ఏర్పాటుకు శుక్రవారం పటాన్​చెరు బస్టాండ్ సమీపంలో భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా గద్దర్ ఫొటోకు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ తాను సొంతంగా రూ. 30 లక్షలతో గద్దర్​ విగ్రహ ఏర్పాటుకు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా పటాన్​చెరులో 11 అడుగుల గద్దర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుండటం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జడ్పీటీసీ సుప్రజా వెంకట్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాండు, మాజీ కార్పొరేటర్ అంజయ్య, దళిత సంఘాల ప్రతినిధులు, సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


సాకి చెరువులో చేప పిల్లల విడుదలపటాన్ చెరులోని  డివిజన్ పరిధిలోని సాకి  చెరువులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో మూడు లక్షల చేప పిల్లలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేయడంతో పాటు మార్కెటింగ్ సౌకర్యం అందిస్తోందని తెలిపారు. ఈ అవకాశాన్ని మత్స్యకారులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు.