Bhoothaddam Bhaskar Narayana OTT: ఓటీటీలోకి రానున్న డిటెక్టీవ్ థ్రిల్లర్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Bhoothaddam Bhaskar Narayana OTT: ఓటీటీలోకి రానున్న డిటెక్టీవ్ థ్రిల్లర్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

టాలీవుడ్ యంగ్ హీరో శివ కందుకూరి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ భూతద్ధం భాస్కర్ నారాయణ (Bhoothaddam Bhaskar Narayana). దర్శకుడు పురుషోత్తం రాజ్ తెరకెక్కించిన ఈ సినిమాలో రాశి సింగ్ అరుణ్ కుమార్, దేవి ప్రసాద్, వర్షిణి సౌందరరాజన్, శివ కుమార్, షఫీ, శివన్నారాయణ, కల్పలత ప్రధాన పాత్రల్లో కనిపించారు.

టీజర్, ట్రైలర్ తో ఆడియన్స్ లో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా మార్చి 1న థియేటర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‍ దక్కించుకుంది. ఇపుడు ఓటీటీ ఆడియన్స్ ను పలకరించడానికి రాబోతుంది.

తెలుగు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా(Aha) ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మార్చి 22వ తేదీ నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఆహా ట్వీట్ చేస్తూ..‘బొమ్మ కనిపించే ప్రతీసారీ దిమ్మతిరిగే ట్విస్టు ఉంటది! అదెంటో తెలుసుకోవాలని ఉందా?’ అంటూ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. 

ప్రస్తుతం థ్రిల్లర్ అండ్ ఇన్వెస్టిగేటివ్ కథలకు మంచి డిమాండ్ ఉంది. ఆడియన్స్ కూడా ఇలాంటి సినిమాలను చూసేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సరిగ్గా అలాంటి కథతో వచ్చిన సినిమానే భూతద్ధం భాస్కర్ నారాయణ.

క్రైమ్ థ్రిల్లర్ కథకి పురాణాలకి, దిష్టిబొమ్మలకి లింక్ చేసి అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రేక్షకులకు కూడా ఒక కొత్త కాన్సెప్ట్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. హత్యలు, ఇన్వెస్టిగేషన్, ఒక్క క్లూ దొరకకపోవడం, దిష్టిబొమ్మలు, పురాణాలతో లింక్ ఇలా ప్రతీ సీన్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తాయి.ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గానిన్ ఇంటెన్స్ మ్యూజిక్ అందించారు.