చంపటం అంటే భయమేస్తుంది.. అది మనిషి అయినా జంతువు అయినా.. వీళ్లు మాత్రం కిరాతకులుగా ఉన్నారు.. కనీసం కనికరం లేకుండా ఉన్నారు.. కుక్కను ఇంటి గేటుకు ఉరి వేసి చంపారు.. సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయిన ఈ ఘటన.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.. పూర్తి వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ సిటీలోని సహారా స్టేట్ కాలనీలో కుక్కల శిక్షణ కేంద్రం ఉంది. ఈ సెంటర్ లో కుక్కలకు శిక్షణ ఇస్తారు. దీంతో నీలేష్ జైస్వాల్ అనే వ్యాపారవేత్త.. తన కుక్కను ట్రైనింగ్ కోసం ఇక్కడ చేర్పించాడు. వారం తర్వాత.. కుక్కను తీసుకెళ్లటానికి వస్తే.. మీ కుక్క చనిపోయిందని సెంటర్ నిర్వహకులు చెప్పారు. దీంతో జైస్వాల్ పోలీస్ కంప్లయింట్ ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు.. విచారణలో భాగంగా సీసీ కెమెరాలు పరిశీలించగా.. అసలు బాగోతం బయటపడింది.
2023, అక్టోబర్ 12వ తేదీ మధ్యాహ్నం.. సెంటర్ నిర్వహకులు కుక్కను బయటకు తీసుకొచ్చారు. మెడకు తాడు బిగించి.. ఇంటి ముందు ఉన్న పెద్ద గేటుకు ఉరి తీశారు. ఏడు నిమిషాలు కుక్క గిలగిలా కొట్టుకుంటూ చనిపోయింది. ఇదంతా కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. సెంటర్ లో పని చేస్తున్న ముగ్గురు వ్యక్తులు.. ఈ దారుణానికి ఒడిగట్టారని.. కేసు నమోదు చేశారు పోలీసులు.
Also Read :- ఐదేళ్ల బాలికపై వృద్ధుడి అత్యాచారం, హత్య
అడ్డంగా దొరికిపోవటంతో.. ఆల్ఫా డాగ్ ట్రైనింగ్ అండ్ బోర్డింగ్ సెంటర్ పై జంతు సంరక్షణ చట్టంతోపాటు ఐపీసీ సెక్షన్ల కింద కేసు పెట్టారు పోలీసులు. ఇంత క్రూరంగా కుక్కను చంపటంపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శిక్షణ ఇవ్వలేకపోతే.. యజమానిని పిలిచి కుక్కను తిరిగి ఇవ్వొచ్చు కదా.. ఎందుకు చంపటం అంటూ ప్రశ్నిస్తున్నారు. కనీసం కనికరం అనేది లేకుండా.. మానవత్వాన్ని మరిచి మరీ ఇంత క్రూరంగా కుక్కను ఉరి వేసి చంపటం కలకలం రేపుతోంది.
भोपाल।
— tarun yadav / तरुण यादव (@tarunya76832195) October 18, 2023
रक्षक के नाम पर भक्षक बने डॉग ट्रेनिंग सेंटर वाले
कुत्ते को फांसी लगाकर की हत्या
व्यापारी निखिल जायसवाल ने ट्रेनिंग सेंटर ने छोड़ा था ट्रेनिंग के लिए डॉग
CCTV कैमरे में कैद हुई घटना
आरोपी रवि कुशवाहा,नेहा तिवारी और तरुण दास ने मिलकर की हत्या#doglovers#police pic.twitter.com/p7uJjla4SQ