ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కేసిన రెండున్నరేళ్ల చిన్నారి

ప్రపంచంలోనే అతి ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ శిఖరాన్ని రెండున్నరేళ్ల చిన్నారి అధిరోహించి సరికొత్త రికార్డు సృష్టించింది. పెద్ద పెద్ద వాళ్లే అక్కడి వాతావరణ పరిస్థితులను తట్టుకోలేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొని వెనుదిరిగి వచ్చేస్తారు. కానీ..  మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్‌ను పూర్తి చేసిన అతి పిన్న వయస్కురాలుగా  భోపాల్‌కు చెందిన సిద్ధి మిశ్రా రికార్డు సృష్టించింది. చిన్నారి సిద్ధి మిశ్రా తన తల్లిదండ్రులు భావ దేహరియా, మహిమ్ మిశ్రాతో కలిసి మార్చి 22న ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్‌ను పూర్తి చేసింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో ఫోస్ట్ చేయగా.. నెటీజన్లు చిన్నారిపై ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు.

ఎవరెస్ట్ పై వారి క్యాంప్  సముద్ర మట్టానికి 5,364 మీటర్ల ఎత్తులో ఉంది. సిద్ధి తల్లి భావా దేహరియా కూడా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్‌ పర్వత శిఖరాన్ని అధిరోహించారు. మే 22, 2019న ఈ ఘనతలను ఆమె సాధించారు. మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాకు చెందిన భావా దేహరియా చిన్నతనం నుంచి తన గ్రామం టామియా చుట్టూ ఉన్న కొండలు ట్రెక్కింగ్ చేయడం ప్రారంభించింది. అలా ఆమెకు ఎత్తైన శిఖరాలను అధిరోహించాలనే ఇష్టంగా మారింది.