పెళ్లయిన మూడో రోజు.. భార్య ఆత్మహత్య వెనక మిస్టరీ ఏంటీ?

పెళ్లయిన మూడో రోజు.. భార్య ఆత్మహత్య వెనక మిస్టరీ ఏంటీ?

నాలుగు రోజుల క్రితమే వివాహమైన ఓ 22 ఏళ్ల యువతి పంచశీల నగర్‌లోని తన భర్త ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.  ఈ ఘటన జూలై 23న మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని, తదుపరి విచారణ కొనసాగుతోందని స్పష్టం చేశారు.

ఈ దారుణానికి పాల్పడిన మహిళను పంజాబ్‌లోని మొహాలీకి చెందిన కుమారి నిషా (22)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MANIT)లో గ్రేడ్ IV కాంట్రాక్ట్ వర్కర్‌గా పనిచేస్తున్న సజన్ అమృతహలే అనే వ్యక్తిని ఆమె ఇటీవలే వివాహం చేసుకుంది.

ALSO READ:గచ్చిబౌలిలో దారుణం.. కదులుతున్న బస్సు టైరు కింద పడి వ్యక్తి ఆత్మహత్య 

ఆదివారం సాయంత్రం నిషా ఆత్మహత్యపై పోలీసులకు సమాచారం అందిందని దర్యాప్తు అధికారి (ఐఓ) అఖిలేష్ త్రిపాఠి తెలిపారు. ఆమె అతని అత్తమామలు, భర్త, అలాగే ఆమె బంధువులను విచారించగా, ఈ ఘటన వెనుక ఎటువంటి నిర్దిష్ట కారణం లేదని చెప్పడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఇరువర్గాల మధ్య ఎలాంటి వివాదాలు కూడా లేవని వారు చెప్పినట్టు సమాచారం. ఇక ఘటన అనంతరం పోలీసులు.. నిషా మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నివేదిక కోసం రెఫర్ చేశారని, ఆ తర్వాతే అసలేమైందన్న దానిపై స్పష్టత వస్తుందని అధికారులు తెలిపారు.