భోపాల్: అమ్మాయి పుట్టిందని సంతోషపడే వారికి దేశంలో కొదవలేదు. చాలా మంది మాటలకే పరిమితం అవుతుంటారు. చేతల్లో తమ కుటుంబానికి లేదా బంధుమిత్రులు, స్నేహితుల వరకు పరిమితం అవుతుంటారు. సాక్షాత్తు మహాలక్ష్మి నా ఇంటికి వచ్చిందని పండుగ చేసుకునే వారికి కూడా కొదవలేదు. అయితే అందరికీ తెలిసేలా ఆనందాన్ని పంచుకునేందుకు ఓ చిరు వ్యాపారి చేసిన ప్రయత్నం ఇప్పుడు దేశమంతా వైరల్ అవుతోంది. స్థానికులు తీసి షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు జాతీయ స్థాయిలో అందర్నీ ఆకర్షిస్తోంది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో నిన్న ఆదివారం జరిగిందీ ఘటన.
అంచల్ గుప్తా (30) అనే వ్యక్తి భోపాల్ నగరంలో పానీపూరి సెంటర్ ను నిర్వహిస్తున్నాడు. మొదటి సంతానం కొడుకు పుట్టడంతో ఒకింత అసంతృప్తికి గురైనా తనకు కూతురంటే ఇష్టమని చెప్పేవాడు. గత ఆగస్టు 17వ తేదీన అంచల్ గుప్తా భార్య రెండో కాన్పులో పండంటి అమ్మాయికి జన్మనిచ్చింది. సంతోషంతో ఆస్పత్రికి వెళ్లి కూతుర్ని చూసొచ్చిన అంచల్ గుప్తా.. సెలబ్రేట్ చేసుకునేందుకు ఆలోచించాడు. బాలింత అయిన తన భార్య ఇంటికొచ్చాక అందరికీ తెలిసే పండుగ చేస్తానని చెప్పి.. దేశమందరికీ తెలిసేలా చేశాడు. తనకు కూతురు పుట్టిన ఆనంద సమయంలో ఇవాళ ఆదివారం తన షాపుకు వచ్చే వాళ్లందరికీ పానీ పూరి ఫ్రీ అని ప్రకటించడంతో వందలు, వేల మంది తరలివచ్చారు. రెగ్యులర్ కస్టమర్లే కాదు.. దారిన పోయే వారు కూడా అంచల్ గుప్తా దొడ్డమనసును కీర్తిస్తూ.. పానీపూరి లాగించేందుకు బారులు తీరారు. చిన్నా పెద్ద.. ఆడ .. మగ తేడా లేకుండా అంచల్ గుప్తా పానీ పూరి సెంటర్ కు క్యూ కట్టడం సంచలనం అయింది. ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో మధ్యతరగతి ప్రజల మధ్యలో ఉన్న ఈ సాదాసీదా షాప్ ఇప్పుడు దేశమంతా గుర్తిస్తోంది. అమ్మాయి తండ్రి అయిన అంచల్ గుప్తాను స్థానికులే కాదు అందరూ అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
#लाड़ली_लक्ष्मी के आगमन पर भोपाल के अंचल गुप्ता ने दिन भर सबको मुफ्त गोलगप्पे खिलाये.
— anuragamitabh انوراگ امیتابھ अनुरागअमिताभ (@anuragamitabh) September 12, 2021
गुप्ता जी का गोलगप्पे का ठेला है,लेकीन दिल दिमाग विचार पहाड़ बराबर.
इन्हें होना चाहिए @CMMadhyaPradesh लाडलियों के लिए चलने वाली योजनाओं का ब्रांड एंबेसडर@ChouhanShivraj @SadhnaShivraj pic.twitter.com/HBvMB2gUmb