నేషనల్ అవార్డు కోసం ‘భూపాలపట్నం’ పరిశీలన 

నేషనల్ అవార్డు కోసం ‘భూపాలపట్నం’ పరిశీలన 

పినపాక, వెలుగు: పినపాక మండలంలోని భూపాలపట్నం పచ్చదనం పరిశుభ్రతపై నేషనల్​అవార్డుకు నామినేట్ చేయబడిన ఏకైక పంచాయతీ. ఐదేళ్ల నుంచి పంచాయతీని అభివృద్ధి చేయడంలో మాజీ సర్పంచ్ కొర్స కృష్ణంరాజు, ఉపసర్పంచ్ నిట్టా వెంకటేశ్వర్లు, వార్డు మెంబర్లు, పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ , పినపాక ఎంపీఓ వెంకటేశ్వరావు కృషిచేశారు.

వారు పంచాయతీ కార్యదర్శి చంద్రకుమార్​ తో కలిసి నేషనల్​ అవార్డు ఎంపిక కోసం కావాల్సిన అంశాలను పూర్తి చేయడంతో మంగళవారం పంచాయతీరాజ్​జాయింట్​కమిషనర్ కృష్ణన్ ఎంపీడీవో రామకృష్ణతో కలిసి గ్రామపంచాయతీని పరిశీలించి వివరాలు సేకరించారు.