భూ భారతితో అన్ని సమస్యలకు పరిష్కారం : ఎంపీ రామసహాయం రఘు రాంరెడ్డి

భూ భారతితో అన్ని సమస్యలకు పరిష్కారం : ఎంపీ రామసహాయం రఘు రాంరెడ్డి

ఖమ్మం రూరల్​, వెలుగు: భూ సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం భూ భారతి చట్టం ప్రవేశ పెట్టిందని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘు రాంరెడ్డి అన్నారు.  ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లిలోని అమ్మ ఫంక్షన్ హాలులో సోమవారం భూ భారతి కొత్త ఆర్ఓఆర్ చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఎంపీ రఘురాంరెడ్డి, జిల్లా ఇన్​చార్జి కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణిలో భూ సమస్యల పరిష్కారానికి రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో  మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, లాయర్లు, వ్యవసాయదారులతో చర్చించి  భూ భారతి చట్టం తీసుకొని వచ్చారని అన్నారు.   ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఆర్డీఓ నరసింహా రావు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా పొన్నెకల్లు నుంచి ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రం దేవరపల్లి వరకు నిర్మిస్తున్న   గ్రీన్​ఫీల్డ్​రోడ్డును ఆర్​అండ్​బీ, నేషనల్​ హైవే అథారిటీ అధికారులతో కలిసి ఎంపీ రఘురాంరెడ్డి పరిశీలించారు

రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలి 

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: ప్రధానమంత్రి గ్రామ సడక్​యోజన, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్కీముల ద్వారా మంజూరైన రోడ్లు, వంతెనల పనులను వేగవంతం చేయాలని ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అధికారులను ఆదేశించారు.  

గవర్నమెంట్‌‌ ఆసుపత్రికి 8 ఫ్రీజర్ల అందజేత

 సోమవారం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ మార్చురీకి ఎంపీ లాడ్స్ నిధులు రూ.8 లక్షలతో కేటాయించిన 8 ఫ్రీజర్లను ఎంపీ  అందజేశారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ బాబు రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.