ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో ఉక్రెయిన్ నుంచి తిరిగివచ్చిన వైద్య విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. తమకు న్యాయం చేయాలని ప్లకార్డులు పట్టుకుని రోడ్డపై ర్యాలీ నిర్వహించారు. వీరికి మద్దతుగా తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. భారతీయ వైద్య విశ్వవిద్యాలయాల్లో తమకు అడ్మిషన్లు ఇవ్వాలని కోరుతున్నారు. వైద్య విద్యను అభ్యసించేందుకు ఉక్రెయిన్ వెళ్లి తాము తీవ్రంగా నష్టపోయామని..ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రణభూమిగా మారిన ఉక్రెయిన్ కు తిరిగి వెళ్లలేమని..తమ భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య వర్సిటీల్లో తమకు సీటు కేటాయించాలని తెలిపారు. లేకుంటే తమ బంగారు భవిష్యత్తు నాశనం అవుతుందని చెప్పారు.
Bhubaneswar, Odisha | Ukraine returned medical students stage protest, seek admission in Indian Medical universities
— ANI (@ANI) July 13, 2022
All we ask is to be admitted in Indian universities, government or private. Our futures have been jeopardized. We cannot go back to a war-torn country: A student pic.twitter.com/E9E5mWucOi